: ఫొటో షేర్ చేసి ఫేస్ 'బుక్' అయ్యాడు!


సామాజిక మాధ్యమాల్లో అత్యుత్సాహంతో చేసే చిన్న చిన్న పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. తాజాగా థాయ్ లాండ్ కు చెందిన ఓ యువకుడ్ని ఓ ఫోటో జైలు పాలు చేయనుంది. బ్యాంకాక్ సమీపంలోని సుముత్ ప్రకన్ ప్రాంతానికి చెందిన తణకర్న్ సిరిపై బూన్ అనే యువకుడు డిసెంబర్ 2న ఫేస్ బుక్ లో వచ్చిన ఓ ఫోటోను లైక్ చేశాడు. తమాషాగా ఉంటుందని భావించి స్నేహితులకు షేర్ చేశాడు. తణకర్న్ షేర్ చేసిన ఫోటో థాయ్ లాండ్ రాజు భూమిబల్ అదుల్యదెజ్ మార్ఫింగ్ ఫోటో కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రాజును అవమానించే విధంగా ఉన్న ఫోటోను లైక్ చేసి, షేర్ చేసినందుకుగాను అతనిపై థాయ్ లాండ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కంప్యూటర్ క్రైం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ఈ కేసులో అతనికి 32 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News