: తెలంగాణలో ప్రజాదరణ కలిగిన నేత సీఎం కేసీఆర్ ఒక్కరే: కొండా మురళి


వరంగల్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ నేత కొండా మురళి సీఎం కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రంలో ప్రజాదరణ కలిగి ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం వల్లే తాను ఏకగ్రీవంగా ఎన్నిక కాగలిగానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల వ్యక్తిగా తనకు అందరూ అండగా నిలిచారని పేర్కొన్నారు. వరంగల్ లో టీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని, కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి వరంగల్ జిల్లా ఎప్పుడూ అండగా ఉంటుందని తన తరపున హామీ ఇచ్చారు. వరంగల్ కార్పోరేషన్ లో టీఆర్ఎస్ ను ఢీకొనే పరిస్థితుల్లో ప్రతిపక్షాలు లేవన్నారు. కాబట్టి ఇప్పటికైనా వారు విమర్శలు మానుకుని సీఎం చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాల్లో కలసి రావాలని కొండా మురళి కోరారు.

  • Loading...

More Telugu News