: రణ్ బీర్ కపూర్ పారితోషికం ఇప్పుడు 38 కోట్లు


ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ పారితోషికం ఎంతో తెలుసా? 38 కోట్ల రూపాయలు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందిన 'తమాషా' సినిమాకు రణ్ బీర్ కపూర్ ఈ భారీ పారితోషికం అందుకున్నట్టు వెల్లడైంది. రణ్ బీర్ ఆదాయ వ్యవహారాలు చూసే ఏజెన్సీపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడంతో ఈ విషయం వెలుగు చూసింది. ప్రస్తుతానికి ఇదే బాలీవుడ్ హాట్ టాపిక్. కాగా, గతంలో హృతిక్ రోషన్ 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమాకి 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News