: ఢిల్లీలో డీజిల్ వాహనాలను న్యాయస్థానం నిషేధిస్తుందా?
ఢిల్లీలో కాలుష్య నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సరి, బేసి సంఖ్యల నిబంధనను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీలో డీజిల్ వాహనాల వినియోగాన్ని నిషేధించాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ధర్మాసనం పేర్కొంది. వచ్చే మంగళవారం నాటికి దీనిపై కోర్టు నిర్ణయాన్ని వెలువరిస్తామని చెప్పారు. డీజిల్ వాహనాలను నిషేధించాలా? లేక పరిమితులు విధిస్తే సరిపోతుందా? అనే దానిపై న్యాయస్థానం పరిశీలన చేయనుందని, ఢిల్లీ మీదుగా ప్రయాణించే ట్రక్కులపై కూడా న్యాయస్థానం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.