: తెలంగాణలో రైతుల పరిస్థితిపై లోక్ సభలో గళమెత్తిన ఎంపీ మల్లారెడ్డి


తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై టీ.టీడీపీ ఎంపీ మల్లారెడ్డి ఈ రోజు లోక్ సభలో మాట్లాడారు. తమ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని, ఇప్పటివరకు 18 వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు కిసాన్ బ్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో సాగునీటి పారుదలకు సౌకర్యం లేదని చెప్పారు. దాంతో విద్యుత్, బోరు బావులపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారని వివరించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు కరవు నిధులను కేంద్ర ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News