: దేశవాళీ క్రికెట్ లో ధోనీ వైఫల్యం


టీమిండియా వన్డే, టీట్వంటీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశవాళీ క్రికెట్లో దారుణంగా వైఫల్యం చెందాడు. దేశవాళీ క్రికెట్లో జార్ఖాండ్ తరపున బరిలో దిగిన ధోనీ కేవలం 9 పరుగులే చేయగలిగాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గ్రూప్ బీలో జమ్మూకాశ్మీర్, జార్ఖాండ్ జట్ల మధ్య కర్ణాటకలోని ఆలూర్ లో మ్యాచ్ జరుగుతోంది. ఎనిమిదేళ్ల తరువాత ధోనీ దేశవాళీ టోర్నీలో ఆడుతున్నాడు. దీంతో అతని ఆటతీరుపై ఆ జట్టు కెప్టెన్ వరుణ్ ఆరోన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే 24 బంతులాడిన ధోనీ ఒక ఫోర్ సాయంతో కేవలం 9 పరుగులే చేయగలిగాడు. దీంతో 50 ఓవర్లు బ్యాటింగ్ చేసిన జార్ఖాండ్ జట్టు 210 పరుగులకు ఆలౌట్ అయింది.

  • Loading...

More Telugu News