: కేసీఆర్ అయుత చండీయాగానికి హాజరవుతా: వెంకయ్య
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 23న మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ లో అయుత చండీయాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాగానికి ఆయన తనను ఆహ్వానించారని, తప్పకుండా హాజరవుతానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో తెలిపారు. కాగా, ఏపీ, తెలంగాణ శాసనసభ స్థానాలు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని, ఈ విషయంపై న్యాయశాఖతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. ఏపీ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు పెంచాలని, తెలంగాణలో శాసనసభ స్థానాలు 117 నుంచి 153 చేయాలని కోరుతున్నారని వివరించారు. ఇక అమృత్ పథకం కింద తెలంగాణలో 12 నగరాలు ఎంపిక చేశామని వెంకయ్య వెల్లడించారు.