: జైల్లో పీటర్ ముఖర్జియాను రెచ్చగొట్టిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ జుందాల్


ముంబై దాడుల వెనుక కుట్ర పన్నాడన్న ఆరోపణలతో 2012 నుంచి ఆర్థర్ రోడ్ జైల్లో ఉంటున్న అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ జుందాల్, షీనా బోరా హత్య కేసులో అదే జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా కాలం గుడుపుతున్న మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియాను రెచ్చగొట్టాడట. గత కొంతకాలంగా జైల్లోని పీటర్ ముఖర్జియాను ఉంచిన గదిలో తనను ఉంచాలని డిమాండ్ చేస్తున్న అబూ, ఇదే విషయమై వాగ్వాదానికి దిగాడని మోకా కోర్టు న్యాయమూర్తి ఏఎల్ అనేకర్ కు జైలు అధికారులు తెలియజేసినట్టు సమాచారం. ఈ ఘటన 1వ తేదీన జరుగగా, అప్పటి నుంచి అబూ జుందాల్ ను ఏకాంతంగా చీకటి గదిలో ఉంచినట్టు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ముంబై దాడుల్లో పట్టుబడ్డ కసబ్ కోసం అత్యంత కట్టుదిట్టంగా నిర్మించిన భవంతిలో పీటర్ ను ఉంచగా, అక్కడి నుంచి ఆయన్ను తరలించాలని, ఆ గది తనకు కేటాయించాలని అబూ జుందాల్ గొడవ పెట్టుకున్నాడట. అంతకుముందు ఇదే గదిలో గ్యాంగ్ స్టర్ సంతోష్ షెట్టిని కొంతకాలం ఉంచారు. ముఖర్జియాను ఉంచిన జైలు గది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండగా, రోజంతా అది దాదాపు తెరిచే ఉంటోంది. హై ప్రొఫైల్ పర్సన్ గా ఉన్న పీటర్ కాసేపు అటూ ఇటూ నడిచేందుకు, జైలు లైబ్రరీకి సులువుగా వెళ్లేందుకు వీలును కల్పిస్తూ, గదికి వెళ్లి వచ్చే కారిడార్ ను తెరుస్తుండగా, ఆ సదుపాయాలు తనకూ కావాలన్నది అబూ డిమాండ్ గా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News