: వెంకన్న మొక్కులెలా తీర్చాలి?... ముగ్గురితో కమిటీ వేసిన కేసీఆర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తిరుమల వెంకన్నకు చెల్లించాలని కేసీఆర్ మొక్కిన మొక్కులను తీర్చే విషయమై ఉన్నతాధికారులతో ఓ కమిటీ ఏర్పడింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని బంగారు ఆభరణాల మొక్కులను తీర్చేందుకు సలహాదారులుగా నియమించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేవాదాయశాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి కే భాస్కర్, కేవీ రమణాచారి, కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వర్ లు సభ్యులుగా కమిటీ ఏర్పాటైంది. మొత్తం రూ. 5.59 కోట్ల విలువైన ఆభరణాలు ఎలా ఉండాలి? వాటిని ఎక్కడ తయారు చేయించాలి? తదితర విషయాలపై ఈ కమిటీ సలహాలు, సూచనలు ఇవ్వనుంది.