: పవార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్... అయుత చండీయాగానికి ఆహ్వానం


ఢిల్లీలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ఎన్సీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్ ను కలిశారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు వచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు కూడా పవార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, త్వరలో తాను నిర్వహించనున్న అయుత చండీయాగానికి రావాలంటూ పవార్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరు పలు విషయాలపై చర్చించుకున్నారు. తెలంగాణ సాధనలో పవార్ తమకు మద్దతిచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఉద్యమ సమయంలో రాష్ట్రంలో పర్యటించి తెలంగాణ అవసరాన్ని చాటారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News