: మగువల మానసచోరుడు ధోనీయేనట!


మహేంద్ర సింగ్ ధోనీ.. ఉత్తరాఖండ్ అల్మోరా పర్వత సానువుల్లో జీవించిన తన కొండజాతి పూర్వీకుల జన్యు లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఈ టీమిండియా కెప్టెన్.. ఇప్పుడు భారత్ లో అతివలు మెచ్చే పురుషుడిగా అవతరించాడు. ఇంటర్నెట్ లో ప్రముఖ వివాహ సంబంధాల వేదిక 'షాదీ డాట్ కామ్' వెబ్ సైట్ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దృఢమైన శరీరంతో పాటు ఒత్తిడి వేళల్లో సైతం నిబ్బరంగా ఉండే ధోనీకే అమ్మాయిల్లో అత్యధికులు ఓటేశారట. ఐపీఎల్-6 సీజన్ సందర్భంగా 'షాదీ డాట్ కామ్' ఈ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ధోనీకి 61 శాతం ఓట్లు రాగా, బర్త్ డే బాయ్ సచిన్ కు 39 శాతం ఓట్లే వచ్చాయట.

  • Loading...

More Telugu News