: అక్రమాస్తుల వ్యవహారం... నెల్లూరులో హెడ్ మాస్టర్ ఇంటిపై ఏసీబీ దాడులు
అక్రమాస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై స్కూల్ హెడ్ మాస్టర్ సురేష్ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ సంఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా కనపర్తిపాడులో జరిగింది. సుమారు కోటి రూపాయల మేర అక్రమాస్తులున్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. సురేష్ బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. పలువురు అధికారులకు సురేష్ బినామీగా ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సురేశ్ ఇంట్లో, బంధువుల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి.