: పోలవరం ప్రాజెక్టుపై ఉమాభారతి కీలక వ్యాఖ్యలు


ఆంధ్రప్రదేశ్ లో నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి ఉమాభారతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుపై ఒడిశా చేస్తున్న అభ్యంతరాలను ఏపీ పరిగణనలోకి తీసుకోవాలని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె అన్నారు. దానిపై ఒడిశా సీఎంతో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కానీ ఏపీ, ఒడిశా సీఎంలు మాట్లాడుకుంటేనే బాగుంటుందని సూచించారు. పోలవరం గిరిజనుల జీవితాలతో ముడిపడిన సున్నితమైన సమస్యని, ప్రాజెక్టు నిర్మాణం చేపట్టక ముందే సమస్యలు సరిదిద్దుకోవాలని ఉమాభారతి కోరారు. ఏపీ, ఒడిశాకు కేంద్ర సహకారం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News