: నెట్ గేర్ నుంచి కొత్త వైఫై రూటర్


ప్రముఖ నెట్వర్కింగ్ సంస్థ నెట్ గేర్ కొత్త వైఫై రూటర్ ను విడుదల చేసింది. 'నైట్ హాక్ ఎక్స్ 8' పేరుతో దీనిని మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. దీనికి నాలుగు యాంటెనాలుండగా, వాటి ద్వారా ఈ రూటర్ అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్ ను అందించగలుగుతుందని సంస్థ తెలిపింది. దాదాపు 5.3 జీబీపీఎస్ గరిష్ఠ స్పీడ్ ను పొందవచ్చు. ఈ రూటర్ లో 1.4 జీహెచ్ జడ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 6 ఈథర్ నెట్ పోర్ట్స్ ఉన్నాయి. వినియోగదారుల ఇంటర్నెట్ స్పీడ్ లకు అనుగుణంగా వివిధ రకాల వైఫై బ్యాండ్ లలో ఇది సిగ్నల్స్ ను ఇస్తుంది. నెట్ గేర్ నుంచి ఇంతకుముందు మార్కెట్ లోకి వచ్చిన రూటర్ల కంటే కొత్తది అత్యధిక దూరం సిగ్నల్స్ ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందిస్తుంది. దీని ధరను రూ.27వేలుగా నిర్ణయించారు.

  • Loading...

More Telugu News