: సల్మాన్ ను దోషిగా తేల్చలేం: బాంబే హైకోర్టు
కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ఇంతకాలం వెంటాడిన 'హిట్ అండ్ రన్' కేసు నుంచి దాదాపు విముక్తి లభించినట్టే. కారుతో ఢీకొట్టిన కేసులో సల్మాన్ ను దోషిగా తేల్చలేమని బాంబే హైకోర్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఆయనపై అభియోగాల నిరూపణలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. విచారణ దశలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రక్త నమూనాల పరీక్షల్లో విభిన్నత ఉందని కోర్టు వెల్లడించింది. కాగా, ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్ కు ఐదేళ్ల శిక్ష విధించగా, ఆయన దాన్ని హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హైకోర్టు సల్మాన్ ను 'దోషి' అనలేమన్న భావనకు రావడం ఆయనకు పెద్ద ఊరటే!