: ప్రపంచమంతా తిరుగుతున్న మోదీకి తెలంగాణకు రావడానికి మాత్రం తీరికలేదు: కేటీఆర్


గత కొంత కాలంగా టీఆర్ఎస్ కు, బీజేపీకి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నట్టు టీఎస్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తుంటే అర్థమవుతుంది. ప్రపంచంలోని 34 దేశాలను తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి... కొత్తగా ఏర్పడిన తెలంగాణకు రావడానికి మాత్రం తీరిక ఉండటం లేదని ఆయన విమర్శించారు. అంతేకాదు... చీపుళ్లు ఇచ్చి స్వచ్ఛ భారత్ అంటున్నారని... అంటే, ఇన్ని రోజులు మనం ఊడ్చుకోకుండా ఉన్నామా? అని అన్నారు. జన్ ధన్ యోజన అంటే కేవలం బ్యాంకు ఖాతాలను తెరవడమేనా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News