: సంచలనం సృష్టించిన కవితా రైనా హత్య కేసులో వీడిన మిస్టరీ!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కవితా రైనా హత్యకేసులో మిస్టరీ వీడింది. ఓ ఫార్మా కంపెనీ మేనేజర్ సంజయ్ రాణా సతీమణి కవితను, ఆగస్టు 24న దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ఆరు ముక్కలుగా తెగ్గోసి గన్నీ బ్యాగుల్లో శరీర అవయవాలను పెట్టి అక్కడక్కడా పారవేయగా, కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులకు అసలు విషయం తెలియడానికి దాదాపు నాలుగు నెలల సమయం పట్టింది. ఇండోర్ లోని మిత్రబంధు నగర్ లో కవిత నివాసానికి దగ్గర్లోని ఓ చీరల కొట్టు దుకాణం యజమాని మహేష్ బైరాగి ఈ దారుణం చేశాడని పోలీసులు కనిపెట్టారు. కవితతో తనకున్న పరిచయం పెంచుకున్న నిందితుడు, ఆమెతో నీలి చిత్రాన్ని తీయడానికి ప్రయత్నించాడని, అందుకు ఆమె నిరాకరించడంతోనే హత్య చేశాడని పోలీసులు కనిపెట్టారు. హత్యకు ముందు ఆమెతో సెల్ ఫోన్లో మాట్లాడింది మహేష్ అని గుర్తించిన పోలీసులు, ఆ దిశగా విచారణ జరిపారు. గత మూడు నెలలుగా విచారణకు సహకరిస్తున్నట్టుగా నటిస్తూ, తనకేమీ తెలియదని బుకాయిస్తున్న నిందితుడి నోటి వెంట నిజాన్ని రప్పించారు.