: సుప్రీంకోర్టులో ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్... త్వరగా పరిష్కరించాలని హైకోర్టుకు ఆదేశం


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసును హైకోర్టు పలుమార్లు వాయిదా వేస్తుండటంతో తమ కేసు విచారణ జాప్యం అవుతోందని ఏపీ ప్రభుత్వం, విద్యుత్ ఉద్యోగులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణలో పనిచేస్తున్న 1156 మంది ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోందని న్యాయవాది ఈ సందర్భంగా సుప్రీంకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై రోజువారీ విచారణ జరిపి త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News