: 'హింట్ అండ్ రన్' కేసులో నేడు బాంబే హైకోర్టు తీర్పు... సల్మాన్ కోర్టు హాల్ లో ఉండాలని ఆదేశం


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ఈరోజు బాంబే హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ కోర్టు హాలులో ఉండాలని అతని తరపు న్యాయవాదులకు న్యాయస్థానం తెలిపింది. దీంతో సల్మాన్ కోర్టుకు మధ్యాహ్నం ఒంటిగంట-ఒంటి గంటన్నర సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో కోర్టు బయట భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు సల్మాన్ సోదరి అల్విరా ఖాన్ కోర్టుకు వచ్చారు. ఈ సాయంత్రంలోగా ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. 2002లో జరిగిన హింట్ అండ్ రన్ ఘటనలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి చనిపోగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. దాంతో ముంబై స్థానిక కోర్టు కొన్ని నెలల కిందట సల్మాన్ కు 5 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఆ తీర్పును బాంబే హైకోర్టులో సవాల్ చేయడంతో నేడు ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News