: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హైదరాబాద్ ప్రజలు ఆదరించాలి: కేటీఆర్
ఈ ఒక్క ఏడాదిలోనే 10 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తున్నామని టీఎస్ మంత్రి కేటీఆర్ చెప్పారు. నాలుగేళ్లలో హైదరాబాద్ లో లక్ష పైచిలుకు ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్ కంటోన్మెంట్ లోని రసూల్ పురాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో 10 వేల ఇళ్ల నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేశామని తెలిపారు. నగరానికి గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చామని, హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెడుతున్నామని చెప్పారు. ప్రజల కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హైదరాబాద్ వాసులు గుర్తించాలని కోరారు.