: 'డార్లింగ్ ఆఫ్ ఇండియన్ మాసెస్'ని హిట్లర్ అని ఎలా అంటారు?: వెంకయ్య ఆగ్రహం
లోక్ సభలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళనపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్ లో ఆందోళన చేయడమే కాక, ప్రధాని నరేంద్ర మోదీని హిట్లర్ అంటారా? అంటూ మండిపడ్డారు. డార్లింగ్ ఆఫ్ ఇండియన్ మాసెస్ (భారత ప్రజల ప్రియతముడు)ని హిట్లర్ అనడం ఎంత వరకు సబబు? అని ప్రశ్నించారు. ఒక ప్రధానిని పట్టుకుని సాక్షాత్తు పార్లమెంటులో ఇలా సంబోధించడం అత్యంత దారుణం అని అన్నారు. ఇన్నేళ్ల తన రాజకీయ చరిత్రలో పార్లమెంటులో కాని, బయటకానీ తాను ఎవరి గురించి ఇలా మాట్లాడలేదని చెప్పారు.