: నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాను: నటుడు సుదీప్
తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని ప్రముఖ కన్నడ హీరో, 'ఈగ' ఫేం సుదీప్ స్పష్టం చేశాడు. కర్ణాటకలోని కోలారు-చిక్కబళ్లాపూర్ ఎమ్మెల్సీ స్థానానికి జేడీఎస్ అభ్యర్థిగా సుదీప్ ఆప్తుడు మనోహర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు సుదీప్ కూడా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. సుదీప్ వచ్చాడన్న సమాచారం అందుకున్న అభిమానులు భారీ సంఖ్యలో అక్కడకు తరలి వచ్చారు. సుదీప్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా, చేయి ఊపుతూ అభిమానులకు అభివాదం చేశాడు సుదీప్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వాస్తవానికి తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని... తన మిత్రుడి కోసమే ఇక్కడకు వచ్చానని చెప్పాడు.