: ఏపీలో కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు... విశాఖ మన్యంలో పెరిగిన చలి తీవ్రత


ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. దాంతో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి సుమారు మూడువేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. లంబసింగి, అమ్మవారిపాదాలులో 7 డిగ్రీలు, చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 9 దాటితే గానీ ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు.

  • Loading...

More Telugu News