: రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి షాక్!... అమేథీ పేపర్ మిల్లు రత్నగిరికి తరలించే యత్నం


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరాఠా పార్టీ శివసేన సీనియర్ నేత, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే షాక్ ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని రాహుల్ సొంత నియోజకవర్గం అమేథీకి కేటాయించిన భారీ పేపర్ మిల్లును మహారాష్ట్రలోని రత్నగిరికి తరలించేందుకు ఆయన యత్నిన్నారు. దీనిపై ఇప్పటికే నోట్ ఫైల్ తయారు చేసిన గీతే, సదరు నిర్ణయంపై మిగతా కేబినెట్ మంత్రుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఆ ఫైలు తిరిగి తన దరికి చేరగానే, కేబినెట్ లో ఆమోదం తీసుకుని తాననుకున్న కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకునేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.3,650 కోట్ల విలువతో అమేథీలోని జగ్దీస్ పూర్ లో పేపర్ మిల్లును ఏర్పాటు చేసేందుకు గతంలో నిర్ణయం జరిగింది. ఈ ఫ్యాక్టరీతో రాహుల్ నియోజకవర్గంలోని దాదాపు 900 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే జగ్దీస్ పూర్ కు కేటాయించిన మెగా ఫుడ్ పార్క్ ను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా పేపర్ మిల్లును కూడా రత్నగిరికి తరలించి రాహుల్ గాంధీకి షాక్ ఇవ్వనుంది. మెగా ఫుడ్ పార్క్ రద్దుపై రాహుల్ గాంధీ పార్లమెంటులో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే మోదీ సర్కారు తన నియోజకవర్గానికి కేటాయించిన ఫుడ్ పార్క్ ను రద్దు చేస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. మరి పేపర్ మిల్లు రద్దు విషయం తెలిస్తే ఆయన ఏ తరహాలో స్పందిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News