: 'కరాచీ ప్రాజెక్టు' కోసం ఉగ్రవాదులకు హిందీ నేర్పేవారు కావాలట!


ఇండియాలోకి సులువుగా చొరబడి, మకాంవేసి ఉగ్రదాడులకు పథక రచన చేయాలంటే, స్పష్టమైన హిందీ తెలిసివుండాలని భావిస్తున్న పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా హిందీ నేర్పేవారిని నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు, ఎవరైనా ఆకర్షితులవుతుంటే అడ్డుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ హెచ్చరించాయి. ఇండియాను టార్గెట్ చేసుకుని 'కరాచీ ప్రాజెక్టు' పేరిట కుట్రకు తెరలేపిన ఎల్ఈటీ, ఇండియాలోని ఉగ్ర సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ తో సమన్వయం కోసం విదేశీ ఉగ్రవాదులకు హిందీ నేర్పడం తప్పనిసరని భావిస్తోంది. ఇక పాకిస్థాన్ లో మాట్లాడే హిందీ, పంజాబీ యాసను పోలి వుండటంతో, తమవారు సులువుగా సైన్యానికి, పోలీసులకు చిక్కుతున్నారని భావిస్తున్న ఉగ్ర పెద్దలు, ఇండియా నుంచి హిందీ శిక్షకులను తీసుకురావాలని నిర్ణయించుకుంది. స్పష్టమైన హిందీ నేర్చుకుని ఉంటే, ఇండియాలో ఎక్కడ ఉన్నా వారిని గుర్తించడం అంత సులువు కాదని భావిస్తోంది. హిందీ టీచర్లకు నెలకు రూ. 30 వేల వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని, ఈ అవకాశం హిందీలో పాండిత్యమున్న ఇండియన్స్ కేనని అంటోంది.

  • Loading...

More Telugu News