: తమిళనాడుకు రూ.10 కోట్ల సాయం ప్రకటించిన ఏపీ... నష్టం పూడ్చలేనిదన్న చంద్రబాబు
వరదలతో అతలాకుతలమైన తమిళనాడుకు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆపన్నహస్తం అందించింది. తమిళనాడులో ఇటీవల కురిసిన వర్షాలు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలను కూడా ముంచేశాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలతో క్షణం తీరిక లేకుండా గడిపిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కాస్త ఆలస్యంగా తమిళ తంబీలకు ఆపన్నహస్తం అందించారు. వదరలతో తీవ్రంగా నష్టపోయిన తమిళనాడుకు రూ.10 కోట్ల ఆర్థిక సహాయం చేయనున్నట్లు ఆయన నిన్న ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా తమిళనాడుకు జరిగిన నష్టం పూడ్చలేనిదని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. తమిళ సోదరులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.