: సినీ నటిని కాకపోయి ఉంటే 'ఐఏఎస్' ఆఫీసర్ని అయి ఉండేదాన్ని: రాశీ ఖన్నా


గతంలో మన కథానాయికలు 'డాక్టర్ కాబోయి యాక్టర్ నయ్యా'నని చెప్పేవారు. అప్పట్లో అదో పెద్ద జోకుగా కూడా మారింది. అయితే, నేటి హీరోయిన్లు మాత్రం దీనిని కాస్త వెరైటీగా చెబుతున్నారు. టాలీవుడ్ తాజా అందం రాశీఖన్నా కూడా అలాగే అంటోంది. సినిమాల్లోకి రాకపోయి వుంటే కనుక 'ఐఏఎస్ అధికారిణిని అయి ఉండేదానిన'ని చెప్పింది. 'బెంగాల్ టైగర్' సినిమా ప్రమోషన్ లో బిజీబిజీగా ఉన్న రాశీ ఖన్నా సోషల్ మీడియాలో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆమెను ఆసక్తికరమైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. వీటిన్నింటికీ రాశీ ఖన్నా ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన తరువాతే తెలుగు నేర్చుకున్నానని తెలిపింది. తెలుగులో అభిమాన నటుడెవరు? అన్న ప్రశ్నకు చాలా మంది ఉన్నారని చెప్పిన రాశీ ఖన్నా 'ప్రస్తుతానికి రవితేజా' అంటూ గడుసుగా చెప్పింది. ఓ పాత్రను ఎంచుకునేందుకు పాత్రతో పాటు నటుడు ఎవరు? అనేది కూడా చూస్తానని, ఆ తరువాత తన పాత్ర తీర్చిదిద్దిన విధానం చూసుకుంటానని రాశీ ఖన్నా వెల్లడించింది.

  • Loading...

More Telugu News