: ఇకపై నగరపాలక సంస్థగా విజయనగరం
విజయనగరం నగరపాలక సంస్థగా మారింది. మొన్నటివరకు పురపాలక సంఘంగా ఉన్న విజయనగరాన్ని నగరపాలక సంస్థగా ప్రకటిస్తూ బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం పురపాలక సంఘంగా ఉన్నప్పుడు ఏ ప్రాంతాలైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ప్రాంతాలు ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజయనగరం నగర పాలక సంస్థపై రేపు గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది.