: రేపు చింతపల్లిలో పర్యటించనున్న వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ రేపు విశాఖపట్టణం జిల్లా చింతపల్లి ప్రాంతంలో పర్యటించనున్నారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్న ఈ సభలో జగన్ మాట్లాడతారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 8 గంటలకు విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన చింతపల్లికి వెళ్లనున్నారని వైఎస్సార్సీపీ కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ పేర్కొన్నారు.