: పోలీసుల్ని తప్పించుకున్నా... చివరికి మొసలికి దొరికిపోయాడు!


పోలీసుల నుంచి విజయవంతంగా తప్పించుకున్న ఒక దొంగ చివరికి మొసలికి ఆహారంగా మారిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో నవంబర్ 13న మాథ్యూ రిగిన్స్ (22) మరో వ్యక్తితో కలిసి ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. వీరి ప్రయత్నాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. తప్పించుకోబోతున్న వీరిని పోలీసులు వెంబడించారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు రిగిన్స్ దగ్గర్లోని ఓ కొలనులో దాక్కున్నాడు. అతనిని గుర్తించలేకపోయిన పోలీసులు వెతుక్కుంటూ వెళ్లిపోయారు. వారం రోజులైనా రిగిన్స్ కనపడకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతని కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, ఆ కొలనులో మాథ్యూ రిగిన్స్ మృతదేహ భాగాలు గుర్తించారు. దీంతో ఆ కొలనులో ఉన్న 11 అడుగుల భారీ మొసలిని పరీక్షించగా, దాని కడుపులో రిగిన్స్ శరీరభాగాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో, పోలీసులను తప్పించుకున్న రిగిన్స్ మొసలికి ఆహారమైపోయాడని నిర్ధారించారు.

  • Loading...

More Telugu News