: జైట్లీ ఇంటి వద్ద పలకరించుకున్న చంద్రబాబు, కేసీఆర్


ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లు మరోసారి కలుసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న వారిద్దరూ దాదాపు నెలన్నర తరువాత ఆత్మీయంగా పలకరించుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ విందు వీరిద్దరి కలయికకు వేదికైంది. జైట్లీ నివాసం నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ అప్పుడే లోపలికి వెళ్లబోయిన చంద్రబాబు ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే ఇద్దరూ పరస్పరం నవ్వుతూ నమస్కరించుకున్నారు. ఈ సమయంలో బాబు వెంట కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన్ రావు, సీఎం రమేష్ తదితరులు ఉన్నారు. ఇటు కేసీఆర్ వెంట ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

  • Loading...

More Telugu News