: పార్లమెంటును స్తంభింపజేయడం మంచి పద్ధతి కాదు: చంద్రబాబు


కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ను స్తంభింపజేయడంపై బాబు స్పందించారు. నేషనల్ హెరాల్డ్ అంశంపై పార్లమెంట్ ను స్తంభింపజేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ అంశానికి సంబంధించిన సమస్యలేమైనా ఉంటే వారు కోర్టుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. కాగా, భారత పర్యాటక రంగం అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మతో ఆయన భేటీ అయ్యారు. పర్యాటక రంగ అభివృద్ధిపై వారు చర్చించారు. మనకున్న వనరుల ఆధారంగా పర్యాటకాన్ని బాగా అభివృద్ధి చేయవచ్చన్నారు. ఈ రంగం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయన్నారు.

  • Loading...

More Telugu News