: తరగతి గదిలో టీచర్ నేతృత్వంలో అమ్మాయిలకు 'నగ్న' పరీక్ష!
చేయని నేరానికి ముగ్గురు అమ్మాయిలు తమ తరగతి గదిలో సహ విద్యార్థుల ముందు సిగ్గుతో... అవమానంతో తలదించుకుని, బిక్కచచ్చిపోయారు. ఛత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ జిల్లాలో జంగల్ పూర్ లోని హయ్యర్ సెంకండరీ స్కూల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ స్కూలులోని 11వ తరగతి గదిలో తన 2000 రూపాయలు దొంగతనానికి గురయ్యాయని ఓ విద్యార్ధి క్లాస్ టీచర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు ముగ్గురు సహవిద్యార్థినులపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఇక వెనుకా ముందూ ఆలోచించకుండానే ఆ టీచర్ ఆ ముగ్గురు విద్యార్థినులను తరగతి గదిలోనే వారి దుస్తులు విప్పించి తనిఖీలు చేయడం జరిగింది. తీరా చూస్తే వారి వద్ద ఆ డబ్బులు దొరకలేదు. దీంతో ఇంటికెళ్లిన విద్యార్థినులు, తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పి, ఇక తాము స్కూలుకు వెళ్ళమని చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు టీచర్ పై డీఈవోకు ఫిర్యాదు చేశారు. సదరు టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.