: ఆ హీరోయిన్ మరణం వర్మలో కూడా కన్నీరుందని తెలిపింది
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏడుస్తారంటే ఎవరూ నమ్మరేమో! వర్మ భావాలు, ఆలోచనలు వింటే ఆయనలో భావోద్వేగాలు ఉన్నాయని ఒప్పుకోవడం కష్టం అని భావిస్తారు. అలాంటి వారి ఊహలను వమ్ముచేస్తూ రాంగోపాల్ వర్మ వెక్కి వెక్కి ఏడ్చాడట. బాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ నిశ్శబ్ధ్ అనే సినిమా తీశాడు. ఆ సినిమాలో ఓ కీలక పాత్రను నటి జియా ఖాన్ పోషించింది. తదనంతర కాలంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. వీటిని చూసి షాక్ కు గురైన రాంగోపాల్ వర్మ వెక్కివెక్కి ఏడ్చాడట. ఈ విషయం రాంగోపాల్ వర్మ తాజా పుస్తకం గన్స్ అండ్ థైస్ లో రాసుకున్నాడు. దీనిని చదివిన వారు మొత్తానికి వర్మలో కూడా కన్నీరుందని అనుకుంటున్నారు.