: గొప్ప ఉదాహరణను... అరుదైనదంటారా?... ప్రసార భారతిపై విమర్శల వెల్లువ!


ఇండియాలో మానవత్వానికి అరుదైన ఉదాహరణ ఇదే... అంటూ ప్రసార భారతి తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్వీట్ పట్ల నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే, చెన్నైని చుట్టుముట్టిన వరద తగ్గుముఖం పట్టిన తరువాత, ఎన్నో ప్రాంతాలు బురదలో కూరుకుపోగా, యువతీ, యువకులు తమ ఇళ్లతో పాటు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను శుభ్రం చేసే పనిలో పడ్డారు. కొందరు ముస్లిం యువకులు చెన్నైలో బురదలో కూరుకుపోయిన దేవాలయాన్ని శుభ్రం చేయగా, ఆ చిత్రాన్ని 'రేర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యుమానిటీ' అంటూ ప్రసార భారతి ట్వీట్ చేసింది. దీన్ని 'గ్రేట్ ఎగ్జాంపుల్' అనాలిగానీ, 'రేర్ ఎగ్జాంపుల్' అంటారా? అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన వేళ ఒకరికి ఒకరు సాయపడే విషయంలో భారతీయులు ఎంతో ముందుంటారని, ఇదేమీ అరుదైన విషయం కాదని, ఓ ఫోటోకు క్యాప్షన్ పెట్టే ముందు మరేమీ పదాలు దొరకలేదా? అని విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News