: తెలుగు సినీ నిర్మాతల మండలిలో ఆర్థిక అక్రమాలు వాస్తవమే: మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో చోటుచేసుకున్న అవినీతిని ఎట్టకేలకు నిర్మాతల మండలి ఒప్పుకుంది. మండలిలో ఆర్థిక అక్రమాలు జరగడం వాస్తవమేనని మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ వెల్లడించారు. ట్రెజరర్, అకౌంటెంట్ కలసి రూ.30 లక్షలు అవినీతి చేసినట్టు ఒప్పుకున్నారని చెప్పారు. ఆర్థిక అక్రమాల వ్యవహారంపై తదుపరి చర్యల కోసం పరిశ్రమ పెద్ద దాసరి నారాయణరావును కలసి చర్చించామని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. మోసం చేసిన డబ్బు తిరిగి చెల్లించేందుకు ట్రెజరర్, అకౌంటెంట్ ఒప్పుకున్నారని బూరుగుపల్లి పేర్కొన్నారు. 2003 నుంచి అకౌంట్స్ ను థర్డ్ పార్టీతో ఆడిట్ చేయించేందుకు కూడా నిర్ణయించామని వివరించారు. దాసరి ఛైర్మన్ గా ఉండే ఓ కమిటీ బాధ్యులపై చర్యలు తీసుకుంటుందన్నారు.