: జగన్ పిటిషన్ పై సీబీఐ కోర్టు నిర్ణయం వాయిదా
వైఎస్ జగన్నోహన్ రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డిల మెమో పిటిషన్ లపై నిర్ణయాన్ని సీబీఐ కోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది. అంతకుముందు ఈ రెండు పిటిషన్ లపై జగన్, సీబీఐ తరపు న్యాయవాదులు సీబీఐ కోర్టు ఎదుట తమ తమ వాదనలు వినిపించారు. తమ కేసులో ఒకే ఛార్జిషీటు దాఖలు చేసేలా సీబీఐకి ఆదేశాలివ్వాలని జగన్ పిటిషన్ వేయగా, తనపై అభియోగం నమోదు ప్రక్రియను నిలిపివేయాలని విజయసాయి కొన్నిరోజుల కిందట పిటిషన్ దాఖలుచేసిన సంగతి తెలిసిందే.