: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని చోట్ల పోటీ చేయడం లేదు: ఉత్తంకుమార్ రెడ్డి
తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. కేవలం ఐదు జిల్లాల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని చెప్పారు. జిల్లా కాంగ్రెస్ కమిటీల నుంచి సరైన ప్రతిపాదనలు రాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నిజామాబాద్ లో- వెంకటరమణారెడ్డి, మెదక్ లో -శివరాజ్ పాటిల్, మహబూబ్ నగర్ లో -దామోదర్ రెడ్డి, నల్లగొండ లో-కొమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, రంగారెడ్డి లో-ఎ.చంద్రశేఖర్ లు తమ పార్టీ తరఫున పోటీ చేస్తారని వివరించారు.