: తప్పు మాది కాదు...కేంద్రానిదే!: రేణుకా చౌదరి
పార్లమెంటును కాంగ్రెస్ పార్టీ ఊరికే అడ్డుకోవడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, ప్రత్యర్థులను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. అందులో భాగంగానే వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. తొలుత చిదంబరం కుమారుడ్ని లక్ష్యం చేసుకున్నారని, ఆ తరువాత వేధింపుల పర్వం మధ్యప్రదేశ్ కు చేరిందని, ఆ తరువాత హిమాచల్ ప్రదేశ్ లో కూడా వేధింపులకు పాల్పడ్డారని, తాజాగా ఏఐసీసీ చీఫ్, డిప్యూటీ చీఫ్ లపై వేధింపులకు దిగుతున్నారని ఆమె విమర్శించారు. కేంద్రం ఏం చేస్తున్నా ఇంతకాలం మౌనం వహించామని, ఇప్పుడు మౌనంగా ఉండే ప్రసక్తేలేదని ఆమె స్పష్టం చేశారు.