: 'దావూద్' కారును కొన్నది తగులబెట్టేందుకే : హిందూ మహాసభ నేత
అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కారును తగులబెట్టేందుకే దానిని తాను సొంతం చేసుకున్నానని హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి అన్నారు. దావూద్ కారుకు నిర్వహించిన వేలం పాటలో సుమారు రూ.3.2 లక్షలు చెల్లించి ఆ కారును ఆయన సొంతం చేసుకున్నారు. దక్షిణ ముంబయిలోని హోటల్ డిప్లమాట్ లో ఈ కారు వేలం నిర్వహించారు. హ్యుందాయ్ యాక్సెంట్ (ఎంహెచ్-04-ఏఎక్స్-3676) కారు వేలం తొలి పాట రూ.15,700తో మొదలైంది. గత నాలుగేళ్లుగా ఘట్ కోపర్ లోని గవర్నమెంట్ సొసైటీ వద్ద ఈ గ్రీన్ సెడాన్ కారు ను పార్కింగ్ స్థలంలో ఉంచారు. గాలి లేని టైర్లతో ఉన్న ఈ కారు బాడీ షేప్ కూడా సరిగ్గా లేదు. కాగా, స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్చేంజ్ మానిప్యులేటర్ల యాక్టు- 1976 ను అనుసరించి ఈ వేలం పాటను నిర్వహించారు. ఇందుకోసం ఒక ప్రైవేటు సంస్థను ప్రభుత్వం నియమించింది.