: ఏం చేస్తున్నారో అర్ధమవుతోందా?: కాంగ్రెస్ ను ప్రశ్నించిన రామ్ జెఠ్మలానీ
ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్న విధానంపై ఆయన మండిపడ్డారు. పార్లమెంటులో ఏం చేస్తున్నారో అర్థమవుతోందా? అంటూ ఆయన కాంగ్రెస్ నేతలను నిలదీశారు. నేషనల్ హెరాల్డ్ కేసు పేరిట సభను అడ్డుకుని కోట్లాది రూపాయల ప్రజాధనం వేస్టు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసులో ఏవైనా సమస్యలుంటే కోర్టు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. న్యాయస్థానంలో పోరాడడం మానేసి పార్లమెంటులో ఆందోళన చేయడమేమిటని ఆయన అడిగారు. తక్షణం కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి మార్చుకోవాలని ఆయన సూచించారు.