: ఇజ్రాయిల్ ను కవ్విస్తూ, రాళ్లు విసురుతున్న పాలస్తీనా బొమ్మలు!


రాళ్లు రువ్వే పాలస్తీనా బొమ్మలను ఇజ్రాయిల్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇజ్రాయిల్ పోర్ట్ హైఫాకు సుమారు 4,000 బొమ్మలు షిప్ లో వచ్చాయి. పాలస్తీనా జాతీయ జెండా రంగులో ఉన్న ఈ బొమ్మల చేతిలో కృత్రిమ రాళ్లు ఉన్నాయి. ‘జెరూసలెం ఈజ్ ఫర్ అజ్’, ‘జెరూసలెం, వుయ్ ఆర్ కమింగ్’ అంటూ జెరూసలెం దేశస్తులను రెచ్చగొట్టేలా వాటిపై నినాదాలు కూడా రాసి వున్నాయని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. జెరూసలెంకు అక్రమంగా తరలిస్తున్న ఆయుధాలను అరికట్టేందుకుగాను కస్టమ్స్ అధికారుల నిఘా తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కార్గోలో దిగుమతి అవుతున్న వస్తువులను క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తుండగా ఈ బొమ్మలు బయటపడ్డాయి.

  • Loading...

More Telugu News