: చైనా సమీపాన అమెరికా గూఢచార విమానం... ఓ కంట కనిపెడుతున్నామన్న చైనా!


సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు అమెరికా గూఢచార విమానం 'పీ8 పొసైడన్' చైనాకు సమీపాన మోహరించడంతో, దాన్ని ఓ కంట కనిపెట్టి ఉన్నట్టు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. "ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. ఇరుగు, పొరుగు దేశాలతో ఉన్న ద్వైపాక్షిక రక్షణ సహకారానికి ఎటువంటి విఘాతమూ కలగదని ఆశిస్తున్నాం. ఇక్కడ శాంతి, స్థిరత్వాలకు వ్యతిరేకంగా ఏ కార్యకలాపాలు జరగవని భావిస్తున్నాం" అని చైనా ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో దక్షిణ చైనా సముద్రంలో అమెరికన్ నావీకి చెందిన యుద్ధ నౌకలు, విమానాలు తిరుగుతుండటం పట్ల చైనా అభ్యంతరాలు వెలిబుచ్చుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News