: బీఫ్ ఫెస్టివల్ పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో ఈ నెల 10వ తేదీన విద్యార్థి సంఘాలు నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ ను నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. కోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. బీఫ్ ఫెస్టివల్ పై కోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొన్నారు. రేపు ఉదయం 8 గంటలకు లోయర్ ట్యాంక్ బండ్ లో నిర్వహిస్తున్న గోపూజ కార్యక్రమానికి స్వామి పరిపూర్ణానంద హాజరవుతారని చెప్పారు. బీఫ్ ఫెస్టివల్ జరిపితే అడ్డుకుంటామని రాజాసింగ్ ఉద్ఘాటించారు. గత కొన్నిరోజుల నుంచి ఎమ్మెల్యే బీఫ్ ఫెస్టివల్ ను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.