: ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు... మరికాసేపట్లో కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూతురు వివాహ రిసెప్షన్ కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆయన కేంద్ర మంత్రులను కలవనున్నట్లు సమాచారం. అరుణ్ జైట్లీ ఇంటిలో విందు తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. ఇప్పటిదాకా ఖరారైన ఈ భేటీల తర్వాత ఇంకా మరికొంత మంది కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలవనున్నట్లు సమాచారం.