: శిఖర్ ధావన్ బౌలింగ్ పై దక్షిణాఫ్రికా ఫిర్యాదు
మూడు రోజుల క్రితం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన భారత ఓపెనర్ శిఖర్ ధావన్ బౌలింగ్ శైలి సరిగ్గా లేదంటూ దక్షిణాఫ్రికా జట్టు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ధావన్ వేసిన ఆఫ్ స్పిన్ బంతులు నియమావళికి లోబడి వున్నాయా? లేవా? అన్న విషయమై తమకు సందేహాలున్నాయని వెల్లడించారు. దీనిపై ఐసీసీ విచారించి తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. కాగా, శిఖర్ ధావన్ బౌలింగ్ చేయడం చాలా అరుదు. ఇప్పటివరకూ ఒక రోజు పోటీలు, టీ-20ల్లో బౌలింగ్ వేయని ధావన్, తానాడిన 19 టెస్టుల్లో 9 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. సౌతాఫ్రికా జట్టు నాలుగో టెస్టులో జిడ్డు ఆట ఆడుతున్న వేళ, మూడు ఓవర్లు వేసి 9 పరుగులిచ్చాడు.