: రష్యా దౌత్యవేత్తపై కేసు నమోదు... అరెస్ట్ కు దౌత్య నిబంధనలే అడ్డు!


మద్యం మత్తు తలకెక్కి ఢిల్లీ వీధుల్లో ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరిని గాయపరచడమే కాక విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ను దూషించారన్న ఆరోపణలపై రష్యా దౌత్యవేత్తపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన రష్యా దౌత్యవేత్త తన కారుతో ఓ బైకును ఢీకొట్టారు. కారును ఆపాలన్న పోలీస్ కానిస్టేబుల్ ఆదేశాలను లెక్కచేయకుండా బారికేడ్లను కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత ముక్కు, నోటి నుంచి రక్తం కారుతున్న స్థితిలో కారు దిగిన సదరు దౌత్యవేత్తను ఆయన స్నేహితుడొకరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనిపై రష్యా రాయబార కార్యాలయానికి సమాచారం చేరవేసిన ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే దౌత్య నిబంధనల కారణంగా ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు లేవు. అయితే ఈ విషయంపై సమగ్ర నివేదికను పోలీసులు కేంద్ర హోం శాఖకు అందజేశారు.

  • Loading...

More Telugu News