: ఈ సంవత్సరంలో అత్యంత పాప్యులర్ అయిన టాప్-10 ట్వీట్లు ఇవే!


2015 సంవత్సరంలో అత్యంత పాప్యులర్ అయిన ట్వీట్ మెసేజ్ ల జాబితాను ట్విట్టర్ విడుదల చేసింది. ఆ వివరాలు ర్యాంకుల వారీగా... (వచ్చిన రీట్వీట్ల సంఖ్య ఆధారంగా) 1. "ఆల్ ది లవ్ యాజ్ ఆల్వేస్.." అంటూ హారీ స్టైల్స్ పెట్టిన ట్వీట్ కు 7.13 లక్షల రీట్వీట్లు వచ్చాయి. 'వన్ డైరెక్షన్' టీమును వీడుతున్నానని జయాన్ మాలిక్ చేసిన ట్వీట్ కు హారీ స్పందన ఇది. 2. "ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్ ది న్యూ సింగల్ ఈజ్ సిక్.." అంటూ జయాన్ మాలిక్ చేసిన ట్వీట్ రెండో స్థానంలో నిలిచి 5.64 లక్షల రీట్వీట్లను పొందింది. 3. "వావ్... ఐదేళ్లు, ఐదుగురు యువకులు. ఎంత అధ్భుతమైన ప్రయాణం. అందరికీ కృతజ్ఞతలు..." అంటూ వన్ డైరెక్షన్ ఐదవ యానివర్సరీ సందర్భంగా లియామ్ పేనీ పెట్టిన ట్వీట్ మూడవ స్థానంలో నిలువగా, మొత్తం 4.95 లక్షల రీ ట్వీట్లు వచ్చాయి. (ఈ మూడు ట్వీట్లూ మార్చి నుంచి ఆగస్టు మధ్య పెట్టినవి. ప్రపంచవ్యాప్తంగా 'వన్ డైరెక్షన్' సంగీత బృందానికి అసంఖ్యాక అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.) 4. "ప్రజల్లో సమానత్వం దిశగా నేడు అతిపెద్ద అడుగు వేస్తున్నాం. స్వలింగ సంపర్కులు ఇకపై వివాహాలు చేసుకోవచ్చు..." అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జూన్ లో చేసిన ట్వీట్ కు 4.48 లక్షల రీట్వీట్లు వచ్చాయి. 5. అభిమానుల నుంచి తమకు వస్తున్న మద్దతుకు ఎంతో ఆనందమంటూ వన్ డైరెక్షన్ టీం సభ్యుడు లూయిల్ టామ్లిన్సన్ చేసిన ట్వీట్ కు 4.12 లక్షల రీట్వీట్లు వచ్చాయి. 6. సౌదీ రాజుగా పట్టాభిషేకం తరువాత కింగ్ సల్మాన్, తన ప్రజల మద్దతు కోరుతూ చేసిన ట్వీట్ ఆరవ స్థానంలో నిలిచి 3.67 లక్షల రీట్వీట్లను అందుకుంది. 7. తన సహచరుడు లియామ్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న నియాల్ హోరన్ "హ్యాపీ బర్త్ డే..." అంటూ చేసిన ట్వీట్ కు 3.20 లక్షల రీట్వీట్లు వచ్చాయి. 8. ఫ్యాషన్ డిజైనర్, అమెరికన్ రాపర్ గా అసంఖ్యాక అభిమానులను సంపాదించుకున్న కెన్యీ ఒమారీ వెస్ట్, "ప్లీజ్: డూ ఎవ్రీథింగ్ యూ పాజిబ్లీ కెన్ ఇన్ వన్ లైఫ్ టైమ్.." అంటూ చేసిన ట్వీట్ కు 3.07 లక్షల రీట్వీట్లు వచ్చాయి. 9. తన మరణానికి ముందు స్టార్ ట్రెక్ లెజండ్ లియోనార్డో నిమోయ్ చేసిన ఆఖరి ట్వీట్ ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచి 2.76 లక్షల రీట్వీట్లు పొందింది. "ఏ లైఫ్ ఈజ్ లైక్ ఏ గార్డెన్. పర్ఫెక్ట్ మూమెంట్స్ కెన్ బి హాడ్..." అంటూ ఫిబ్రవరి 23న ఆయన తన చివరి ట్వీట్ పంచుకున్నారు. 10. లింగమార్పిడి చేయించుకుని బ్రూస్ నుంచి కైట్లిన్ గా మారిన అనంతరం అతడు/ఆమె చేసిన ట్వీట్ కు 2.59 లక్షల రీట్వీట్లు వచ్చాయి. "నా స్టయిల్ లో నేను జీవించేందుకు దీర్ఘకాలం పాటు సమస్యలను ఎదుర్కొన్నాను. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి కైట్లిన్ గా వస్తున్నా, నేను అతడినో / ఆమెనో తెలుసుకోవాలన్న మీ కోరిక నెరవేరేందుకు ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు" అన్న ట్వీట్ ఇది.

  • Loading...

More Telugu News