: ప్రతిపక్ష నేతలపై మండిపడ్డ వెంకయ్య నాయుడు


నేషనల్ హెరాల్డ్ కేసు పార్లమెంటు సమావేశాలను అట్టుడికిస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు కోర్టు నోటీసులు ఇవ్వడంపై ఉభయసభల్లోని కాంగ్రెస్ సభ్యులు సభాకార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్, ఛైర్మన్ పోడియంలను చుట్టుముట్టారు. ఈ క్రమంలో, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సభను అడ్డుకుంటున్న వారిపై మండిపడ్డారు. కోర్టు ఆదేశాలకు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు. కోర్టు కేసులను రాజకీయం చేయడం మంచిది కాదని సూచించారు. యూపీఏ పాలనలో అమిత్ షాను జైలుకు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. సభాకార్యక్రమాలను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ సభ్యులు దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. కరవుపై చర్చ జరగకుండా సభాకార్యక్రమాలను అడ్డుకోవడం సబబు కాదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News