: కళ్లల్లో కారం కొట్టిన దొంగలను పట్టేసిన పోలీసులు... 24 గంటల్లోనే ‘కంది’ కేసు ఛేదన


హైదరాబాదు శివారు ప్రాంతం మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని కంది గ్రామ పరిసరాల్లో మొన్న రాత్రి జరిగిన దారి దోపిడీ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. మొన్న రాత్రి పత్తి వ్యాపారులు కొందరు హైదరాబాదు నుంచి తమ సొంతూరు సదాశివపేటకు రూ.50 లక్షల నగదుతో బయలుదేరారు. మార్గ మధ్యంలో కంది సమీపంలో కారు ఆపి టీ తాగారు. వ్యాపారుల వద్ద పెద్ద మొత్తం నగదును పసిగట్టిన దుండగులు కంది దాటగానే వారి కారును మరో కారుతో అడ్డగించారు. వ్యాపారులు తేరుకునేలోగానే వారి కళ్లల్లో కారం కొట్టిన దొంగలు రూ.50 లక్షలను ఎత్తుకెళ్లారు. షాక్ కు గురైన వ్యాపారులు సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దారి దోపిడీ దొంగలను పట్టేశారు. నిందితుల నుంచి రూ.50 లక్షల నగదుతో పాటు రెండు కార్లను సీజ్ చేశారు. మరికాసేపట్లో దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News